తాళ్లూరు మండల సర్వసభ్య సమావేశంలో తహసీల్దార్ పనితీరుపై సభ్యుల ఆగ్రహాం -కల్తీ పాలపై అట్టుడిక మండల సర్వసభ్యసమావేశం

గ్రామాల్లో రెవెన్యూ సమస్యలు పరి
ష్కారం కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా సర్వసభ్య సమావేశంలో తహసీల్దార్ దృష్టికి తీసుక వెళుదామనుకున్నా మూడునెలలకు ఓసారి జరిగే స మావేశానికి తహసీల్దార్ రాక పోవటంపై ఎంపీపీ, జడ్పీటీసీ, వైస్ఎంపీపీ, పలు గ్రామాల సర్పంచ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మండల పరిషత్ సమావేశం మందిరం లోఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అధ్యక్షతన మండలసర్వసభ్య సమావేశంఎంపీడీవో కె. సుందరరామయ్య ఆద్వర్యంలో శనివారం జరిగింది. ఈసందర్భంగా ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, వైస్ఎంపీపీ ఐ. వెంకటేశ్వరరెడ్డి, పలువురు సర్పంచ్ లు  తహసీల్దార్ మండల సమావేశానికి హజరు కాక పోవటాన్ని తప్పు బట్టారు. రీసర్వే జరిగిన గ్రామాల్లో రికార్డులు తప్పుల తడలో ఉన్నఆస్థిని అన్నదమ్ములు భాగపరిష్కారం చేసుకుని  ఆన్ లైన్  చేయమని   మ్యుటే షన్ కు దరఖాస్తు చేసుకుంటే  రిజిష్టర్ తెమ్మని రెవెన్యూ అధికారులు అంటున్నారని ఎలా సాద్య మన్నారు. తహసీల్దార్ ఈ సమస్యలపై. … ప్రజా ప్రతినిధుల సందేహాలను   నివృత్తి చేయాల్సి వుండగా డిటీ వచ్చి సభలో ఏమి సమాధానం చెబుతారన్నారు. మూడు నెలలకు ఓసారి జరిగే సమావేశానికి రాకుండా తప్పించుకుంటే రెవెన్యూ సంబంధిత  సమ స్యలు ఎలా పరిష్కారమవుతాయని ప్రశ్నించారు. మండల సమావేశాలకు అధికారులు హజరై తగు పరిష్కార మార్గాలు చూపి తగు న్యాయం జరిగేలాచూడాల్సి’పుండగా గైర్హాజరు కావడం ‘మంచి పద్ధతి కాదన్నారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ …. సర్పంచ్ లు, ఎంపీటీసీలు సభలో ఏదైనా సమస్య అడిగితే అధికారులు సమావేశంకు రాక పోతే ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మండల స్థాయి అధికారులు సమావేశానికి తప్పక రావాలన్నారు. ఎంపీడీవో సుందరరా మయ్య మండల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామాల్లో సీసీరోడ్లు, ఉపాధి పనులు సకాలంలో పూర్తి చేయిస్తూ మండలాన్ని అగ్రగామిగా నిలుపుతున్నారన్నారు. జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి మాట్లాడుతూ…. గ్రామాల్లో ప్రజా ప్రతి నిధుల సహకారంతో అన్ని గ్రామాల్లో అభివృద్ధిపనులు జరిగేలా చూడాలన్నారు.
గ్రామాల్లో మంచినీరు కలుషితం అవుతూ వ్యాధులు ప్రభలు తున్నందున మంచినీటిని సక్రమంగా క్లోరినేషన్ చేయించాలని కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

*కల్తీపాలపై అట్టుడిక మండల సర్వసభ్యసమావేశం* ….

మండలంలోని పలు గ్రామాల్లో పాల డైరీ లు ఎక్కువగా పెరిగి నందున కల్తీపాలు తయారవుతూ వున్నాయని దీనిని కట్టడి చేయాలని విఠలాపురం సర్పంచ్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్రసేనారెడ్డి సభ దృష్టికి తీసుక వచ్చారు. ఇళ్లలో పాలు బాగున్నా బయట కాఫీ తాగాలన్నా భయాందోళన చెందాల్సి వుందన్నారు. కల్తీపాల వల్ల ప్రాణాంతక వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయన్నారు. దీనిపై పలువురు ఎంపీటీసీలు, సర్పం చ్ లు కల్తీపాల తయారీ దారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో గతంలో కంటే ఎక్కువ పాలు పోసే పాలఉత్పత్తిదారులపై దృష్టి సారించి తగు విచారణ చేస్తే కల్తీ బట్టబయలు అ వుతుందని, వారిపై తగు చర్యలు తీ సుకోవాలని డిమాండ్ చేశారు. నాగంబొట్లపాలెం సర్పంచ్ చిమటా సుబ్బారావుమాట్లాడుతూ… అధికారులుపాలడైరీలపై దాడులు చేసి కల్తీపాలు తయారీ జరుగు తున్నట్లు నిర్ధారణ జరిగినా ఆమ్యామ్యాలు తీసుకుని వదిలి వేయటం జరుగుతుం దే తప్ప ….ప్రజలకు ఎలాంటి న్యాయం జరుగటం లేదన్నారు. పశువై ద్యాధికారి ప్రతాప్  రెడ్డి మాట్లాడుతూ… సభ్యుల విన్నపాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుక వెళతామన్నారు. విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లు  మరమ్మత్తులకుగురైనా, దొంగిలించ  బడ్డా వాటి స్థానంలో కొత్తవి భిగించేందుకు తీవ్ర జాప్యం జరుగుతున్నందున రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్ లు  మారం ఇంద్రసేనారెడ్డి, మంచాల వెంకటేశ్వర్లు,సుబ్బారావులు అధికారుల దృష్టికి తీసుక వచ్చారు. త్వరితగతిన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి పంటలు ఎండిపోకుండా చూడాలన్నారు. ఇంచార్జి విద్యుత్తు ఏఈ శ్రీనివాసరావు మాట్లాడుతూ… జనవరి మాసంలో అన్ని ట్రాన్స్ ఫా ర్మర్లు ఏర్పాటు చేస్తామన్నారు. మండలానికి రెగ్యులర్ విద్యుత్తు ఏఈని నియమించాలని పలువురు సభ్యులు సభ దృష్టికి తీసుక వచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ఎంపీపీ వెంకటేశ్వరరెడ్డి, డిప్యూటీతహసీల్దార్ ఇమ్మానియేల్ రాజు,  విద్యుత్తు, మండల, హౌసింగ్, ఆర్ డబ్ల్యుఎస్ఏ ఈలుశ్రీనివాసరావు,వెంకటేశ్వరరావు,హనుమంతరావు, వాలి, వైద్యాధికారులు  ఖాదర్ మస్తాన్ బి, మౌనిక, మండల పశువైద్యాధికారి  ప్రతాప్ రె డ్జి, వ్యవసాయాధికారి ప్రసాద్ రావు, ఎంఈవోలు సుబ్బయ్య, సుధాకర్ రావు, ఏపివో మురళి.ఈసీ ప్రసాద్, సర్పంచ్లు, ఎంపీటీసీలు పలుశాఖల అధికారులు, తదిత రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *