తాళ్లూరు మండలంలోని తూర్పుగంగవరం జిల్లాపరిషత్ హైస్కూల్లోని 8,9,10 వ తరగతి విద్యార్థులకు లక్ష్యజాబ్ అకాడమి, యూనిసెఫ్, నీట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిజిటల్ ప్రొడక్టివిటీ కోర్సుపై సోమవారం శిక్షణ ఇచ్చారు. ఈసందర్భంగా బిఎఫ్ ఎస్సై ఒకేషనల్ ట్రైనర్ వై.అంజిబాబు మాట్లాడుతూ… ఇప్పటికి లక్ష్య జాన్అకాడమి ఆధ్వర్యంలో 3500 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. హైస్కూల్ హెచ్ఎం సిహెచ్ అరుణకుమారి మాట్లాడుతూ… విద్యార్థులకు నైపుణ్యంపై పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చినపుడు వారి లోని నైపుణ్యం పెరిగి విద్యాభివృద్ధికి ఉపయోగపడతాయన్నారు. తమ పాఠశాల విద్యార్థులకు నైపుణ్యంపై ఉచితంగా శిక్షణఇచ్చిన లక్ష్య జాబ్ అకాడమికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎంఈవో-2 ఎల్ సుధాకర్ రావు విద్యార్థులకు సరికేట్లు అందజే శారు. ఈకార్యక్రమంలో ఎంఈవో-2 ఎల్.సుధాకర రావు, ఉపాధ్యాయులు నాగిరెడ్డి, పవన్, విజయ్ కుమార్, అంజిబాబు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

