పూర్తిగా అస్తవ్యస్తంగా తయారై మరమ్మత్తులు పూర్తిచేసిన తాళ్లూరు-
తూర్పుగంగవరం ఆర్అండ్ బి
రోడ్డు నిర్మాణ పనుల నాణ్యతా ప్రమాణాలను క్యూసీ ఈఈ శ్రీనివాసరావు, ఆర్అండ్ బి డీఈ. గోపీకృష్ణల ఆద్వర్యంలో అధికారులు సోమ వారం పరిశీలించారు. ఇటీవల తాళ్లూరు- తూర్పుగంగవరం ఆర్అండ్ బీ మార్గంలో 5 కిలో మీటర్ల మేర నూతనంగా తారు రోడ్డు నిర్మించారు. రోడ్డు నాణ్యతా ప్రమా ణాలను అ క్కడక్కడ గుంతలు తీసి సాంకేతికత ఆధారంగా పరిశీలించారు. ఈ5 కిలో మీటర్ల మేర నూతనంగా తారు రోడ్డు నిర్మించారు. రోడ్డు నాణ్యతా ప్రమా ణాలను అక్కడక్కడ గుంతలు తీసి సాంకేతికత ఆధారంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో క్యూసీ డీఈ నాగేంద్రబాబు, ఏఈ సుబ్రమణ్యం, ఆర్అండ్ బీ ఏఈలు షేక్ రఫీ, స్రవంతి, రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు పనులు పూర్తయిన ప్రాంతంలో రాకపోకలకు ఇబ్బందులు లేకుండా మార్జిన్లో మట్టితో చదును చేయాలని కంటాక్టర్కు అధికారులు సూచించారు.
