రాష్ట్రంలో మద్యతరగతి నివాస
విద్యుత్తు వినియోగదారుల ప్రయోజనం కోసం కేంద్రప్రభుత్వం పిఎం సూర్యఘర్ ముఫ్ట బిజ్లి యోజన పథకంను ప్రవేశపెట్టిందని దర్శి విద్యుత్తు ఈఈ పాలగిరి శ్రీనివాసులు తెలిపారు. నాగంబొట్లపాలెం గ్రామంను పీఎం సూర్యఘర్ గా ఎంపిక చేయటంతో ప్రజల్లో ఈపధకం ప్రయోజనాలపై సోమవారం నాగంబొట్లపాలెం గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఈఈ శ్రీనివాసులుమాట్లాడుతూ మద్యతరగతి విద్యుత్తు వినియోగదారులకు మూడు కేటగిరిలుగా విభజించి రాయితీ ఇస్తుందన్నారు. 0-150 యూనిట్లు 1-2 కిలో వాట్లు వాడుకునే వి నియోగదారులకు రూ. 30,000నుండి రూ.60000ల సబ్సీడీ, 150-300 యూనిట్లు 2-3 కిలోవాట్లువాడుకునే వినియోగదారులు రూ. 68,000 నుండి రూ. 78,000ల సబ్సీడీ, 300 యూనిట్లు 3 కిలోవాట్లు వాడుకునే వినియోగదారులకు రూ.78,000ల సబ్సీడీ ఇవ్వటం జరుగుతుందన్నారు. దరఖాస్తు చేయువినియోగదారులు 6నెలలకు తక్కవ కాకుండావిద్యుత్తు బిల్లులు జమచేయాలన్నారు. సోలార్ విద్యుత్తును తక్కువ ఖర్చుతో వినియోగించుకోవచ్చునన్నారు. 1కెవీ సోలార్ రూప్టాప్ ప్యానెల్ నెలకు దాదాపు125 యూనిట్లు ఉత్పత్తి చేస్తుందన్నారు. వినియోగదారులకు 5 నుండి 6సంవత్సరాల్లో మూల ధన వ్యవయాన్ని తిరిగి పొంద వచ్చునన్నారు. సోలార్ విద్యుత్తు వల్ల జరిగే ప్రయోజనాలనువివరించారు. మద్యతరగతి విద్యుత్తు వినియోగదారులు, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో దర్శి ఇంచార్జి విద్యుత్తు డీఈఈ డివీ కృష్ణారెడ్డి, ఏఈ వి.శ్రీనివాసరావు, లైన్ఇన్పెక్టర్ వివిఎస్ కాంతారావు, లైన్మెన్ వెంకటేశ్వర్లు, విద్యుత్తు వినియోగదారులు. రైతులు పాల్గొన్నారు.
