వ్యవసాయశాఖలో 43ఏళ్ల పాటు అం
కిత భావంతో పని చేసిన ఏఈవో జి.నాగరాజు నేటితరం ఉద్యోగులకు ఆదర్శనీయుడని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎస్. శ్రీనివాసరావు అన్నారు. పదవీ విరమణ చేస్తున్న ఏఈవో నాగరాజుకు తాళ్లూరు రైతు సేవా కేంద్రం వద్ద వీడ్కోలు సభ నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా అధికారి ఎస్. శ్రీనివాసరావు మాట్లాడుతూ ….గ్రామాల్లో రైతులను, ప్రజలను కలుపుకుని నాగరాజు అందరి మన్ననలు పొందారన్నారు. క్రమశిక్ష ణగా ఏలాంటి సెలవు కూడా పెట్టకుండా, విధులు నిర్వహించి, ఒక్క రిమార్క్ లేకుండా పదవీ విరమణ చెందటం అభినందనీయమాన్నారు. తాళ్లూరు, దర్శి ఎన్పోర్సు మెంట్ ఏ.ఓ, సాంకేతిక శాఖ ఏవో, కోరిశపాడు, అద్దంకి ఏవోలు బిప్రసాద్ రావు, బడే సంగమేశ్వరరెడ్డి, శ్రీనివాసరావు, పి.శ్రీనివాసరావు, కొర్రపాటి వెంకట క్రిష్ణ తదితరులు నాగరాజు వ్యక్తిత్వాన్ని, వృత్తిపట్ల ఉన్న అంకిత భావం గురించి కొనియా డారు. సన్మాణ గ్రహిత ఏఈవో జి.నాగరాజు మాట్లాడుతూ 43 ఏళ్లపాటు విధుల్లో వున్న తనపట్ల ఎంతో ప్రేమగా వున్న అధికారులకు, ఎరువుల దుకాణం డీలర్లకు అభినందనలు తెలిపారు. ముందుగా జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు నాగరాజు దంపతులనుదుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. నాగరాజు అభిమానులు కూడా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు తాళ్లూరు, దర్శి ఎన్పోర్సు మెంట్ ఏ.ఓ, సాంకేతిక శాఖ ఏవో కోరిశపాడు, అద్దంకి ఏవోలు బిప్రసాదావు, బడేసంగమేశ్వరరెడ్డి, శ్రీనివాసరావు, పి.శ్రీనివాసరావు, కొర్రపాటి వెంకట క్రిష్ణ ఏఈవోలు, విఏఏలు, రైతులు పాల్గొన్నారు.
