ప్రభుత్వ సాంకేతిక పరంగా శాస్త్రయుక్తంగా విద్యార్థులను ప్రొత్సహిస్తూ సాంకేతిక పరిజ్ఞాన ప్రదర్శనలు నిర్వహించటం అభినందనీయమని తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు అన్నారు. వికే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం మండల స్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు ప్రభుదాస్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డిలు ముఖ్య అతిథిలుగా పాల్గొని సైన్స్ ఫెయిర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు మాట్లాడుతూ ….. చిన నాటి నుండే విద్యార్థులు సైన్స్ పట్ల అభివృద్ధి కలిగి ఉండాలని కోరారు. విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రధమ స్థానంలో నిలిస్తే తన వంతుగా స్వంత నిధులతో రూ.10వేలు అందించి ప్రొత్సహిస్తానని చెప్పారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరాలంటే సాంకేతికతపై పట్టు తప్పని సరి అన్నారు. శాస్త్రవెత్తల జీవితాలు, సాంకేతిక రంగంలో విజయం సాధించిన వారి కేస్ స్టడీస్ గురించి చదివి జీవితంలో విజయం సాధించే దిశగా ప్రయత్నం చెయ్యాలని సూచించారు. ఎంఈఓ – 1 జి. సుబ్బయ్య, ఎంఈఓ -2 సుధాకర రావు, పీఎంసీ కమిటీ చైర్మన్ సత్యవర్ధన్, ఉపాధ్యాయులు మండలంలోని పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.




