మండల మహిళా సమాఖ్య సమావేశం నిర్వహణ – రుణాలు సకాలంలో రికవరీ చెయ్యాలి

మండల మహిళా సమాఖ్య సమావేశం మంగళవారం ఇందిరా క్రాంతి కార్యాలయంలో ఎంఎంఎస్ అధ్యక్షురాలు సుజాత అధ్యక్షతన నిర్వహించారు. దర్శి నియోజక వర్గ స్త్రీనిథి మెనేజర్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పొదుపు సంఘాల నుండి తీసుకున్న స్త్రీ నిథి రుణాలు సకాలంలో తిరిగి చెల్లించి మరలా పొంది అభివృద్ధి చెందాలని కోరారు. ఎపీఎం దేవరాజ్ మాట్లాడుతూ సీఐఎఫ్, బ్యాంకు లింకేజి రుణాలు పొందిన పొదుపు సంఘాల సకాలంలో చెల్లించినట్లయితే బ్యాంకులో ఉత్తమ కస్టమర్లగా గుర్తించి మరలా రుణాలు అందిస్తారని అన్నారు. రుణాలు చెల్లింపులో అలసత్వం వహించవద్దని చెప్పారు. అనంతరం ముందస్తు నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. సంఘ అధ్యక్ష, కార్యదర్శులు సుజాత, లీల, కోశాధికారి బాగ్యలక్ష్మి, పూర్వ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు విజయలక్ష్మి, సుభాషిణి, సీసీలు మోహన్ రావు, సుచంద్రలు పాల్గొన్నారు. ముందుగా ఇటీవ బదిలీపై దర్శి వెళ్లిన సీసీ కోటేశ్వరమ్మను ఘనంగా సన్మానించి ఆమె చేసిన సేవలను కొనియాడారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *