ప్రకాశం జిల్లా ప్రజలకు, కూటమి కార్యకర్తలు, నాయకులు, అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
డా. డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు.
నూతన సంవత్సరంలో సరికొత్త ఆశలు, లక్ష్యాలతో ప్రజలు మరింత సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. 2025లో ఇంటింటా ఆనందాలు, ప్రతీ కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లి విరియాలని అన్నారు. అన్ని సామాజిక వర్గాలు సుస్థిరమైన అభివృద్ధి పథంలో ప్రయాణించేలా కూటమి పాలన ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరి కళ్లలో ఆనందం చూడాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు.
జిల్లా ప్రజలతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఒక ప్రకటన లో తెలిపారు.
