ఎస్సీ కుల గణన సోషల్ ఆడిట్ పై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఎ తమీమ్ అన్సారియా జనవరి 7 వరకు గడుపు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి ఎన్ లక్ష్మా నాయక్ తెలిపారు. జిల్లా లో ఎస్సీ పౌరులు అభ్యంతరాలు ఎవైనా ఉంటే జనవరి 7 వరకు అభ్యంతరాలు తెలిపాలని, 11 వరకు అభ్యంతరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారని చెప్పారు. 17న కుల గణన తుది వివరాలను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారని చెప్పారు. ఆమేరకు జిల్లా కలెక్టర్ నుండి ఉత్వర్వులు అందినట్లు చెప్పారు.
