ఘనంగా తాళ్లూరు మండలంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహణ – పలువురు ప్రముఖులను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ప్రజా ప్రతినిధులు – నాయకులు

తాళ్లూరు మండలంలో నూతన సంవత్సర వేడుకలను బుధవారం ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. తాళ్లూరు, తూర్పుగంగవరంలలో అర్ధరాత్రి నూతన సంవత్సర వేడుకలతో యువకులు కేరింతలు కొడుతూ సందడి చేసారు. మహిళలు, ప్రజలు ఎక్కువగా దైవ సన్నిధిలో గడపటానికి ఇష్టపడ్డారు. రాజకీయ నాయకులు పలు పార్టీల నేతలను కలుసుకొని శుభాకాంక్షలను తెలిపారు.
ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీలు ఐ. వెంకటేశ్వరరెడ్డి, కో ఆప్షన్ మెంబర్ కరిముల్లా, టిడిపి యువ నాయకుడు ఐ శ్రీనివాస్ రెడ్డి , షేక్ పెద కాలేష వలి ( బడే ), కరువది మేజర్ వైస్ చైర్మన్ తూము శివనాగిరెడ్డి , సర్పంచిలు వలి, పిఎస్ శ్రీకాంత్ రెడ్డి , నాయకులు కైపు రామకోటిరెడ్డి ,నాగార్జున రెడ్డి, గొంది రమణారెడ్డి (సమర) ఎంపీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎంఈఓ జి సుబ్బయ్య, యూటీఎఫ్ నాయకులు, గ్రామకార్యదర్శి ఐవీ రమణా రెడ్డి, ఏపీఓ మురళి, కార్యాలయ సిబ్బంది పుష్పగుజ్జం ఇచ్చి ఎంపీపీకి, జెడ్పీటీసీ, ప్రజా ప్రతినిథులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీడీఓ సుందర రామయ్య, మండల వైద్యాధికారి ఖాదర్ మస్తాన్ బి, ఎంఈఓ సుబ్బయ్య, తహసీల్దార్ సంజీవ రావులకు ఆయా కార్యాలయ సిబ్బంది, అధికారులు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఎంపీపీ, జెడ్పీటీసీ, ఇతర మండల ప్రజా ప్రతినిథులు పలు పార్టీల నాయకులు వేరువేరుగా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ని, టిడిపి ఇన్చార్జి గొట్టి పాటి లక్ష్మి, డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ , మాజీ మంత్రి శిద్దా రాఘవరావు , ఇతర ప్రముఖులను కలసి శుభాకాంక్షలు తెలిపేందుకు తరలి వెళ్లారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *