దర్శి నియోజక వర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్లను తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు నాయకులు కలిసి ఎస్సీ, బీసీ విద్యార్థులకు అవసరమైన నోటుస్తకాలను, అభ్యసన సామగ్రి అందించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అందులో ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి షేక్ పెద కాలేషా వలి, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు, క్లస్టర్ ఇన్చార్జి రాచకొండ వెంకట రావు, కెవీ పాలెం సర్పంచి శ్రీదేవి రామయ్య, కొత్త పాలెం సీనియర్ నాయకుడు కైపు రామ కోటి రెడ్డి, క్లస్టర్ ఇన్చార్జి కైపు నాగార్జున రెడ్డి, మాధవరం టిడిపి నాయకుడు నుసుం ఆది నారాయణ రెడ్డి, ఎంఎంఎస్ అధ్యక్షురాలు సుజాత తదితరులు పాల్గొన్నారు.
