దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కి అభిమానుల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు అధిక సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. ఐదు మండలాల్లోని కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా దర్శి లోని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఇంటి వద్దకు చేరుకుని పూలమాలలతో శాలువాలతో ఘనంగా సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా కేకులు కట్ చేస్తూ స్వీట్లు పంచుకుంటూ గొట్టిపాటి లక్ష్మి అభిమానులు దర్శి లోని గొట్టిపాటి లక్ష్మీ ఇంటి ప్రాంగణం మొత్తం కోలాహలంగా మారింది.


