అంగ్ల నామ నూతన సంవత్సర సందర్భంగా బేగంపేట కార్పొరేటర్ దంపతులు టి. మహేశ్వరి, శ్రీహరి లు గురువారం మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవును మారేడ్ పల్లి లో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా శాలువాతో సత్కరించి అభినందనలు ,శుభాకాంక్షలుతెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వెంట బిఆర్ఎస్ సీనియర్ నాయకులు టి శ్రీహరి, టి శ్రీనివాస్ రావు, యువ నాయకులు ఆరిఫ్ తదితరులు ఉన్నారు.
