మంచానికే పరిమితమైన నడవలేని స్థితిలో ఉండి రూ.15వేలు పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారుల సదరం సర్టిఫికేట్ పరిశీలనకు జిల్లా స్థాయిలో ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ తమీమ్ అన్సారియా తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఎన్. టి. ఆర్ భరోసా పెన్షన్ పధకానికి సంబంధించి ఎపీ ఆరోగ్యశాఖ, పంచాయితీ రాజ్, సెర్ఫ్ శాఖల అధికారుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్. ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. జనవరి 31లోపు అర్హలయిన మరియు అనర్హులను గుర్తించటానికి మైక్రో యాక్షన్ ప్లాన్ తయారు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి టి వెంకటేశ్వర్లు, సర్వజన వైద్యశాల సూపరిండెంట్ టి జమున, డీసీహెచ్ఎస్ డాక్టర్ సూరి బాబు, జిల్లా లెప్రసీ అధికారి డాక్టర్ సురేష్ కుమార్, డిఆర్ డీఏ పీడీ రవి కుమార్, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డీపీఓ వెంకట నాయుడు, అన్ని మున్సిపాలిటీల కమీషనర్లు పాల్గొన్నారు.

