విద్యుత్ శాఖా మంత్రి గొట్టి పాటి రవికుమార్ ను తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు గురువారం ధేనువు కొండ గ్రామంలో కలిసారు. తాళ్లూరు మండలంలో రైతులు ఎదుర్కోంటున్న పలు విద్యుత్ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దర్శి నియోజక వర్గ టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి సహకారంతో పలు సమస్యలు పరిష్కరించుకున్నామని, ఇంకా మండలంలో చీమకుర్తి రోడ్డులో నిలచిపోయిన సబ్ స్టేషన్ ను పూర్తి చేస్తే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. తగిన చర్యలకు మంత్రి హామీ ఇచ్చినట్లు ఎంపీపీ తెలిపారు.
