సిడాప్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక స్వయం ఉపాధి రంగాలలో యువతీ యువకులకు మైనార్టీ సంక్షేమశాఖ ద్వారా రెసిడెన్షియర్ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ కార్యనిర్వాహక సంచాలకులు కె ధన లక్ష్మి తెలిపారు. 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉండది పదవ తరగతి నుండి బిటేక్ వరకు ఎదైనా కోర్సు చదివి ఉన్న వారు అర్హలని చెప్పారు. ఉచిత శిక్షణ, రవాణా, కేరీర్ కౌల్సిలింగ్, యూనిఫాం, వసతి, ఆహారం, స్టడీ మెటీరియల్, ఎన్ ఎస్ డి సి సర్టిఫికేట్ ఇవ్వబడునని చెప్పారు. జిల్లాలోని మైనార్టీ వర్గాలకు చెందిన యువతీ యువకులు తమ బయోడేటాను విద్యార్హతలతో జత పరచి ఎపీ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్, ఒంగోలు చిరునామాకు పంపాలని కోరారు. పూర్తి వివరాలకు ఫోన్ నంబర్ 9951160149ను సంప్రదించాలని కోరారు.
మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సిడాప్ ద్వారా ఉచిత శిక్షణ
03
Jan