బిహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు బాలురను గురువారం వారి తల్లిదండ్రులకు బాలల సంరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అప్పగించారు. గత నెల 27న ధాన బాద్ నుండి అల్లాపూర్ ఎక్స్ ప్రెస్ లో చీరాల రైల్వే స్టేషన్లో అకస్మిక తనిఖీలు నిర్వహించి మాన అక్రమ రవాణా జరుగుతున్న విషయాన్ని గుర్తించి స్వీట్ దుకాణంలో పనిచేయటానికి వస్తున్న ముగ్గురు పిల్లలను గుర్తించి చీరాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి బాలల సంక్షేమ కమిటీ ముందు హాజరు పరిచినారు. లైట్ హౌస్ ఫర్ బాయిస్ నందు ఆశ్రయం కల్పించి వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు పూర్తి ఆధారాలతో కమిటీ ముందు హాజరు పరచగా విచారించిన బాలల సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ రామాంజనేయులు మిగిలిన సభ్యులు ఎకీభవించి తల్లిదండ్రులకు కౌల్సిలింగ్ నిర్వహించి వారిని చదివించాలని తెలపి వారి అప్పగించారు.
ఆయా రాష్ట్రాల బాలల సంక్షేమ కమిటీని సమాచారం అందించారు.
