బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం గంజాయి సేవించడం యూటీజింగ్ పాల్పడే వారిని పై నార్త్ జోన్ డీసీపీ సాధనా రష్మీ పెరుమాళ్ నేతృత్వంలో బేగంపేట ఏసిపి గోపాలకృష్ణమూర్తి , బేగంపేట ఇన్స్పెక్టర్ చిర్ర రామయ్య లుశుక్రవారం రాత్రి బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ని పలు బస్తీల్లో విస్తృతంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అదనపు పోలీసు బలగాలను దింపే పోలీస్ స్టేషన్ పరిధిలోని రసూల్ పురా, అన్న నగర్, శ్రీలంక బస్తి ,పాటిగడ్డ,ప్రకాష్ నగర్ తది తర బస్తీల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని
ఆట కట్టించేందుకు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించేవారు గంజాయి సేవించేవారు ఈవ్ టీజింగ్ కు పాల్పడే వారిని గుర్తించి 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. నార్త్ జోన్ పరిధిలో ఒక ముందు కూడా ఇలాంటి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తామనీ, బహిరంగ ప్రదేశాలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. యువత ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొని తమ విలువైన కెరీర్ ను నాశనం చేసుకోవద్దని డి సి పి హెచ్చరించారు. ఎవరైనా బహిరంగ ప్రదేశాలలో మద్యం,గంజాయి సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి వారిపై నిఘా కొనసాగిస్తానని అన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో బేగంపేట ఏ సి పి గోపాల కృష్ణ మూర్తి,ఇన్స్పెక్టర్ చిర్ర రామయ్య, ఎస్ఐలు జయ చందర్, శ్రీధర్, నాగరాజు, శ్రీరాములు ఏ ఎస్సైలు పోలీస్ లు పాల్గొన్నారు .





