ప్రజల ప్రాణాలు కాపాడటానికి అహర్నిశలు శ్రమించే వైద్యులకు నిజమైన హీరోలని నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసిపి జి. శంకర్ రాజు అన్నారు.
శనివారం నేచర్ క్యూర్ హాస్పిటల్, బల్కంపేట వైద్య విద్యార్థులు, సిబ్బంధికి రోడ్డు ప్రమాదాలు మరియు నివారణ అనే అంశంపై ట్రాఫిక్ ఏసిపి శంకర్రాజు పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత. అందుకు రహదారులపై విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. సిగ్నల్ పడ్డప్పుడు ఆగే ఓపిక కూడా కొందరు వాహనదారులకు లేకుండా పోతుండటం బాధాకరం. తొందరగా వెళ్లాలనే ఆత్రుతలో రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు.
ముఖ్యంగా రెడ్ సిగ్నల్ పడినప్పుడు తప్పనిసరిగా వాహనం ఆపాలన్నారు. హైదరాబాద్ పోలీసు పరిధిలో 2023 లో 65,413 & 2022లో 42,261 సిగ్నల్ జంపింగ్ కేసులు నమోదయ్యాయన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదనీ, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ. 5000 వరకు జరిమానా మరియు మూడు నెలల జైలు శిక్షను కూడా విధిస్తారు. 2023 సంవత్సరంలో 6173 మంది, 2024 సంవత్సరంలో 3300 మంది డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి టి. టి. ఐ బేగంపేట్ లో కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు వాహనం నడిపేటప్పుడు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి అని చెప్పారు. వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పని సరిగా హెల్మెట్ ధరించాలన్నారు. కారులో ప్రయాణం చేస్తున్నపుడు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలి. వాహనాలు నిర్లక్ష్యముగ నడపటం ప్రమాదకరం అన్నారు. వారికి కలిగిన సందేహాలను కూడా వివరించారు. ఈ కార్యక్రమములో సుమారు 100 మంది వైద్య విద్యార్థులు మరియు నేచర్ క్యూర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ లక్ష్మన్ ,డాక్టర్ మల్లిఖార్జున,డాక్టర్ శ్రీకృష్ణ , హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.


