అంధులు చదువుకునే విధంగా బ్రెయిలీ లిపిని ఆవిష్కరించిన లూయిస్ బ్రెయిలి జయంతిని పురస్కరించుకుని ఒంగోలులోని కలెక్టర్ ఆఫీస్ లో శనివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలోని స్పందన హాలులో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఒంగోలు నగరానికి చెందిన అంధులు కార్యక్రమంలో పాల్గొనగా వారికి క్విస్ కాలేజికి చెందిన ఎన్ సీసీ క్యాడెట్లు సాయం చేశారు. వారిని స్పందన హాలుకి తీసుకురావడం, వారికి కావాల్సినవన్నీ అందించడం, తిరిగి తీసుకెళ్లడం లాంటివి చేసి సాయంగా నిలబడ్డారు. అంధులకి కావాల్సిన వస్తువులను దగ్గరుండి సమకూర్చారు. ఈ సందర్భంగా వారికి సాయంగా నిలబడిన క్విస్ కళాశాల ఎన్ సీసీ క్యాడెట్లను జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ అభినందించారు. ఇలాంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొని అందరికీ మంచి చేయాలని ఆయన ఆకాంక్షించారు.
