కనుమరుగవుతున్న సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరానికి అందించాలన్న సంకల్పంతో సాయిబాబా సెంట్రల్ స్కూల్లో 8వ మరియు 9వ తరగతి బాలికలకు శనివారం ముగ్గుల పోటీ నిర్వహించామని పాఠశాల అకడమిక్ డైరెక్టర్ సాయినాథుని శృతి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మనం ఇండ్ల ముందు వేసే ముగ్గులు చీమ ల్లాంటి కీటకాలకు ఆహారమై సంప్రదాయానికి ప్రతీకలుగా నిలవడమేగాక ముగ్గులు వేసే వారికి ఆరోగ్యాన్ని, ఏకాగ్రతను, సృజనాత్మకతను మరియు
మానసికోల్లాసాన్ని పెంపొందిస్తాయని వారు తెలియజేశారు. ఈ పోటీలలో పాల్గొని గెలుపొందిన విద్యార్థులను అభినందించి పాఠశాల తరపున వారికి ప్రశంసాపత్రాలను అందజేశారు.







