చూపులేని వారి జీవితాలలో వెలుగులు నింపిన మహానీయుడు లూయిస్ బ్రెయిలీ అని కళాశాల ఎస్. ఎస్. ఎన్ కళాశాల డైరెక్టర్ మరియు ప్రిన్సిపాల్ పై సత్యనారాయణ రెడ్డి అన్నారు. ఎస్ ఎస్ ఎన్ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకంలో బాగంగా శనివారం లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మరియు ప్రిన్సిపాల్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ బ్రెయిలీ చూపు లేని వారి జీవితాలలో వెలుగులు నింపిన మహానీయుడని కేవలం స్పర్శ ద్వారా నే అక్షర జ్ఞానాన్ని తద్వారా ప్రపంచ జ్ఞానాన్ని తెలుసునే మార్గాన్ని చూపిన వ్యక్తి అని, చూపు లేని వారిలో జీవన జ్యోతిని వెలిగించిన మహానీయుడని కొనియాడారు. వైస్ ప్రిన్సిపాల్ టి రాజశేఖర్ రెడ్డి, ఎన్ ఎస్ ఎస్ అధికారులు రాజేంద్ర బాబు, రవి తేజ, షేక్ నిరూషా, అధ్యాపకులు పార్థసారధి, ఆనోక్ తదితరులు పాల్గొన్నారు.
