రైతులకు ఎంతో మేలు చేసేందుకు గత ప్రభుత్వంలో చేసిన తప్పులను సరిదిద్దేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సదుద్దేశ్యంతో చేపట్టిన గ్రామ రెవిన్యూ సభలను ఉద్దేశ్య పూర్వకంగా తూ… తూ మంత్రంగా నిర్వహిస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు ఆవేదన వ్యక్తం చేసారు. మాధవరం గ్రామంలో శనివారం గ్రామ రెవిన్యూ సదస్సు నిర్వహించారు. సర్పంచి తాటికొండ రేణుక అధ్యక్షతన సభను నిర్వహించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ …..రెవిన్యూ సదస్సు గురించి ఎవరికైనా సమాచారం ఇచ్చారా అని ప్రశ్నించారు. గ్రామంలో దండోరా వేయ్యలేదని రైతులు తెలిపారు. దండోరా వెయ్యకుండా తూ… తూ మంత్రంగా నిర్వహించే సభ రైతులకు ఎందుకు ఉపయోగపడుతుందని నిలదీసారు. గత ప్రభుత్వ హయాంలో రీ సర్వేలో అనేక తప్పులు దొర్లాయని వాటిని సరిదిద్దాలని కార్యాలయం చుట్టూ రైతులు ప్రదక్షణలు చేస్తున్నా పట్టించుకున్న నాధుడు లేదని అన్నారు. విషయాన్ని తహసీల్దార్ సంజీవ రావు దృష్టికి తీసుకువెళ్లేందుకు అనేక సార్లు ఫోన్ చేసినా సరే కనీసం …. ప్రజా ప్రతినిథులకు సైతం విలువ ఇవ్వకుండా ఫోన్ లు సైతం ఎత్తక పోవటం దారుణమని అన్నారు. ఇలాంటి అధికారులు వలన ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని అన్నారు. సమస్యలు తీర్చలేని, సమాచారం ఇవ్వని సదస్సులు వద్దు రద్ద చెయ్యాలని గ్రామ కార్యదర్శిని కోరారు. తమ పొలాలు ఆన్ లైన్ లో అనేక తప్పులు దొర్లాయని సరిచేయక పోతే తమకు ఆత్మ హత్య శరణ్యమని రైతులు పలువురు సభ దృష్టికి తెచ్చారు. రైతులకు తగిన న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటానని తహసీల్దార్ సంజీవయ్య రైతులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల సర్వేయర్ శ్రీనివాస రావు, విఆర్ ఓ రమణ, గ్రామ కార్యదర్శి అల్లం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

