ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నబోజన పథకం ఏర్పాటు చేయటం కళాశాల విద్యార్థులకు చాలా మంచి అవకాశం అని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అన్నారు. వికే ప్రభుత్వ జూనియర్ కళాశాల లో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్నబోజన పథకం ప్రారంభించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, కళాశాల దాత ఊటుకూరి రామ కోటేశ్వర రావు, యువ నాయకుడు ఐ శ్రీనివాస రెడ్డి, కరువది వైస్ చైర్మన్ తూము శివ నాగి రెడ్డి, కోటి రెడ్డి, ఎంఈఓ -1 సుబ్బయ్య, ఎంఈఓ -2 సుధాకర రావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కళాశాల ప్రన్సిపాల్ కొండ పల్లి ఆంజనేయులు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ కళాశాల అభ్యున్నతికి ప్రిన్సిపాల్. అధ్యపక బృందం చేస్తున్న కృషిని కొనియాడారు. ప్రిన్సిపల్ వచ్చిన తర్వాత కళాశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు నుండి నూతన సైన్స్ గ్రూపుల ఏర్పాటు వరకు ఆయన చేసిన కృషి అభినందనీయమని అన్నారు. పేద, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మధ్యాహ్నభోజన పథకం ఒక వరం అని అన్నారు. తమ వంతుగా భోజన పథకానికి చేయూతగా ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు రూ. 5వేలు సహాయం అందించారు. అదే విధంగా జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి తన వంతు చేయూత ప్రకటించారు. ఎంపిడీఓ సుందర రామయ్య , సర్పంచ్ లు మందా చార్లెస్ సర్జన్ , వలి గ్రామ యువకులు కోట శ్రీనివాస రెడ్డి, చందోలు శివ రామ క్రిష్ణ, చందోలు రవికుమార్, మారం రామ కోటి రెడ్డిలు ప్లేట్స్ ఇతర సామగ్రిని అందించి దాతృత్వం చాటుకున్నారు.


