విద్యార్థుల అభ్యున్నతికి తాము ఎల్లవేళలా చేయూత అందిస్తామని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. బూచేపల్లి వెంకాయమ్మ, సుబ్బా రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పదవతరగతి విద్యార్థులకు ఆన్ ఇన్ వన్ లు అందించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ …దివంగత ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బా రెడ్డి ఆధ్వర్యంలో బూచేపల్లి ట్రస్ట్ ద్వారా విద్యార్థులను ఆదుకునేందుకు చేపట్టిన కార్యక్రమం కొనసాగిస్తూ పేద విద్యార్థులకు చేయూత ఇస్తున్నట్లు చెప్పారు. తాను విద్యను అభ్యసించిన పాఠశాల అభ్యున్నతికి అనేక విధాలుగా చేయూత అందించామని, అందిస్తూనే ఉంటామని అన్నారు. వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అమ్మ, నాన్నలకు పాఠశాల పట్ల గ్రామం పట్ల మమకారం ఎక్కువ అని నిత్యం పాఠశాల అభివృద్ధికి గ్రామ అభివృద్ధికి బాటలు వేసారని గ్రామ ప్రజలు కూడ తమపై అదే మమ కారంతో ఉండటం తమ అదృష్టమని అన్నారు. పేద విద్యార్థుల అభ్యున్నతికి పదవతరగతి విద్యార్థులకు ఎంతో ఉపయుక్తమైన స్టడీ మెటీరియల్ అందిస్తూ చేయూత ఇస్తున్నామని అన్నారు. పాఠశాలలో ఎమైనా సమస్యలు ఉంటే తక్షణ పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముందుగా దివంగత ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బా రెడ్డికి పూల మబబాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో ఇన్చార్జి హెచ్ఎం సురేష్, సర్పంచి మందా శ్యామ్సన్, ఎంపీటీసీ బాల కోటయ్య, మాజీ సొసైటీ అధ్యక్షుడు వైస్ సర్పంచి పులి ప్రసాద్ రెడ్డి, పులి రామి రెడ్డి., పులి అంజి రెడ్డి, రిటైర్డ్ హెచ్ఎం అంజి రెడ్డి, సంగన యోగి రెడ్డి, మాజీ ఎంపీటీసీ బి గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పలువురు వైసీపీ నాయకులకు పరామర్శ …..
అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ సర్పంచి పులి క్రిష్ణా రెడ్డి, పలువురు వైసీపీ క్రీయాశీలక కార్యకర్తలు గంగవరపు రామ కోటి రెడ్డి, పుట్లూరి నారాయణమ్మ, మాజీ ఎంపీటీసీ దేవండ్ల కోటయ్య లను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డిలు పరామర్శించారు. ఆయా కార్యక్రమాలలో మాజీ ఎంపీపీ పోశం మధుసూధన రెడ్డి, సర్పంచిల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్ర సేనా రెడ్డి, సర్పంచిలు సుబ్బా రావు, బ్రహ్మా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






