అంధుల కోసం లూయి బ్రేయిలీ చేసిన సేవలు అమోఘమని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాల క్రిష్ణ అన్నారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో శనివారం లూయిస్ బ్రయిలీ జయంతి వేడుకలు నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని బ్రెయిలీ విగ్రహానికి, చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. జిల్లాలో అంధులకు, దివ్యాంగులకు జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు వారి సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. మోప్మా పీడీ టి రవి కుమార్, బీసీ సంక్షేమాధికారి యం అంజల, జిల్లా గ్రంధాలయ సంస్థ సెక్రటరీ ఆదిలక్ష్మి, మైనార్టీ కార్పోరేషన్ ఈడీ ధన లక్ష్మి, జిల్లా విజిలెన్స అధికారి ఘాన్సీ, జిల్లా రవణాశాఖాధికారి సుశీల, ఐసీడీఎస్ స్కిల్ డవలప్ మెంట్ అధికారి రవి తేజ, పాఠశాల గేమ్స్ సెక్రటరీ మహమ్మద్ హజీర బేగం, జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ జెడీ, కార్యనిర్వాహణాధికారి జి అర్చన పలు సంఘాల నాయకులు పాల్గొని బ్రెయిలీ సేవలు గుర్తు చేసుకున్నారు. క్రీడలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు. ప్రభుత్వ బ్రెయిలీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
