జెసి ప్రభాకర్ రెడ్డి దూషణలను భారతీయ జనతా పార్టి ప్రకాశం జిల్లా మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బి విజయరావ్ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.
సినీ యాక్టర్ మాధవి లతని, మరియు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ పై రాయలేనంతగా అనుచిత వ్యాఖ్యలు చేసిన తాడిపత్రికి చెందిన జేసి ప్రభాకర్ రెడ్డి పై వెంటనే చర్యలు తీసుకోవాలని బి. విజయరావు ఒక ప్రకటనలో డిమాండ్ చేసినారు.
మహిళలను దేవతలుగా పూజించే పుణ్యభూమి అయిన భారత దేశంలో అదీ మహిళలకు జాగ్రత్తలు తెలిపిన మాధవీలత, యామిని శర్మలను కించపరుస్తు మాట్లాడిన జేసి దివాకర్ రెడ్డి సభ్య సమాజంలో ఉండటానికి అనర్హుడు. వారు తమ మాటల ద్వారా బిజేపిని, బిజేపి నాయకురాళ్ల పై చేసిన వ్యాఖ్యలతో సాటి మహిళగా బాధచెంది జేసి ప్రభాకర్ రెడ్డిపై వెంటనే న్యాయస్థానం సుమోటోగా కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా విజయరావు విజ్ఞప్తి చేశారు.
