ఆంధ్రప్రదేశ్ షేడ్యూల్ కులముల వర్గీకరణ విషయమై ప్రత్యేక సిఫారస్ లు చేయుటకై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఎక సభ్య కమీషన్ చైర్మన్ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా రెండు రోజులపాటు జిల్లాలో పర్యటిస్తారని తహసిల్దార్ సంజీవరావు , ఎంపీడీవో కే సుందర రామయ్య లు తెలిపారు. సోమవారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రకాశం భవన్ లోని సమావేశపు మందిరంలో షేడ్యూల్ కులములకు సంబంధించి ఫిర్యాదులు. సలహాలు, సూచనలు స్వీకరిస్తారని తెలిపారు. వీఆర్వోలు ,గ్రామ కార్యదర్శులు ఈ విషయాన్ని ఆయా గ్రామాల్లో సర్పంచులకు ఎంపీటీసీలకు ఇతర సంఘాల నాయకులకు తెలపాలని కోరారు.
ఈ అవకాశాన్ని సంబంధిత వర్గాల ప్రజలు, నాయకులు, సంఘ నాయకులు సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో వేరువేరుగా కోరారు.
నేడు షేడ్యూల్ కులముల వర్గీకరణ విషయమై ఫిర్యాదు స్వీకరణ
06
Jan