అంగన్వాడీ ల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలు ఉపయోగించు కోవాలని వక్తలు కోరారు. వెలుగువారి పాలెం ప్రాథమిక పాఠశాల ఆవరణలోని ఐసీడిఎస్ ద్వారా అందిస్తున్న
పౌష్టికాహారము, విద్యా వికాసంగురించి సోమవారం ప్రదర్శన ఏర్పాటు చేసి చిన్నారులకు , తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానోపాధ్యాయులు పోలంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ… అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులను చేర్పించి వారి శారీరక , మానసిక వికాసానికి, జ్ఞానాభివృద్ధికి అంగన్వాడీ కేంద్రాలను ఉపయోగించుకోవాలన్నారు. అంగన్వాడి కార్యకర్త ఆర్ సునీత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చిన్నారులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
