2024-25 రబీ పంటలో నమోదు ఆయన పంటలను
సోమవారం తహసీల్దార్ సంజీవ రావు, వ్యవసాయాధికారి ప్రసాద రావు బృందం సూపర్ చెక్ నిర్వహించారు. తాళ్లూరు-1లో నమోదు చేసిన పంటల వివరాలను, యాప్లో నమోదు అయిన వివరాలను సర్వే నంబర్, విస్తీర్ణం, పంట రకం, నీటి వసతి ఇతర వివరాలను పరిశీలించారు. అర్హలకు న్యాయం జరిగేందుకే ఏడు అంచెలలో తనిఖీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల సర్వేయర్ వై శ్రీనివాస రావు, విఆర నాగలక్ష్మి, విఏఏ నాగ రాజు నాయక్, విలేజ్ సర్వేయర్ ఖాదర్ బాషలు పాల్గొన్నారు.
