ఒంగోలులోని క్విస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫిబ్రవరి 7,8,9 తేదీల్లో జరిగే క్విస్ ఫెస్ట్ 2025ను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు క్విస్ విద్యాసంస్థల ఛైర్మన్ డాక్టర్ ఎన్. సూర్య కల్యాణ్ చక్రవర్తి , వైస్ ఛైర్మన్ డాక్టర్ ఎన్. శ్రీగాయత్రి తెలిపారు. క్విస్ ఫెస్ట్ 2025 పోసర్ట్ ని కళాశాలలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కల్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ ఏటా ఫెస్ట్ ని ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది నేషనల్ లెవెలో జరగుతుందని, వివిధ రాష్ట్రాలకు చెందిన ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాల విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు. రివైవ్, రీ యూజ్, రీ సైకిల్ అనే కాన్సెప్ట్ తో పర్యావరణహితంగా ప్రాజెక్ట్ లు, పేపర్ ప్రజంటేషన్స్, క్విజ్, టెక్నికల్ ఎక్స్ పో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. పాటల పోటీలు, డ్యాన్సులు, క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని, గెలుపొందిన వారికి జ్ఞాపికలు, నగదు బహుమతి, ప్రశంస పత్రాలు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్విస్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్. వైవి. హనుమంతరావు , ఫార్మసీ ప్రిన్సిపల్ డాక్టర్ కిశోర్ బాబు , ఫెస్ట్ కన్వీనర్ డాక్టర్ డి. సమీర్ కుమార్ , ఫెస్ట్ కో – ఆర్డినేటర్లు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

