ఆరేళ్లలోపు పిల్లలందరికీ ఆధార్ కార్డు మంజూరు చేసేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. బుధవారం ఒంగోలులోని ఇస్లాంపేటలో ఏర్పాటు చేసిన బాల ఆధార్ నమోదు శిబిరాన్ని ఆమె సందర్శించారు. ఆధార్ కార్డు కోసం పిల్లల వివరాలను నమోదు చేస్తున్న తీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మట్లాడుతూ.. బర్త్ సర్టిఫికెట్ ఉన్న పిల్లలందరికీ తక్షణమే ఆధార్ కార్డు కోసం వివరాలు నమోదు చేస్తున్నామన్నారు. బర్త్ సర్టిఫికెట్ లేని వారికి తొలుత బర్త్ సర్టిఫికెట్ అధికారులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బాలల ఆధార్ నమోదు కోసం ప్రతి మండలంలోనూ ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సి.ఈ.ఓ. చిరంజీవి, ఐ.సి.డి.ఎస్. పి.డి. బి.హేనా సుజన్, సి.డి.పి.ఓ.లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


