అసాంఘిక కార్యకలాపాల కట్టడి, ట్రాఫిక్, నేరాల నియంత్రణకు డ్రోన్ కెమెరాలతో నిఘా: ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్

ప్రకాశం జిల్లా పరిధిలో లా & ఆర్డర్ కాపాడుట, నేరాలు & ట్రాఫిక్ నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా, విపత్తు నిర్వహణ మరియు ఇతర పోలీసింగ్ అవసరాల కొరకు టంగుటూరు మండలం, ఆలకూరపాడు గ్రామానికి చెందిన అనుమెలు రవిచంద్ర (ఎన్‌ఆర్‌ఐ) అనే వ్యక్తి బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ కి అత్యాధునిక సాంకేతికత కూడిన ఒక డ్రోన్ DJI Air3s కెమెరాను అందచేసినారు. ప్రకాశం జిల్లా పోలీస్ శాఖకు సామాజిక బాధ్యత, సేవా స్పూర్తితో ఒక ఎన్‌ఆర్‌ఐ వ్యక్తి తన స్వదేశానికి సేవ చేసే ఉద్దేశంతో పోలీస్ శాఖకు ఒక డ్రోన్‌ ను బహుకరించడం అభినందనీయమని జిల్లా ఎస్పీ పోలీస్ శాఖ తరుపున వారికి కృతజ్ఞతలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…. ఈ డ్రోన్ కెమెరాల ద్వారా నేరాలను సేదించడం, శాంతి భద్రతల పరిరక్షణలో మరియు వివిధ విఐపి ల బందోబస్తులలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయలు జరగకుండా డ్రోన్ కెమెరాలను ఉపయోగించడం జరుగుతుందని, పోలీస్ కానిస్టేబుల్ లకు డ్రోన్ ఆపరేట్ చేసే విధంగా శిక్షణ ఇవ్వటం కూడా జరిగిందని, లైవ్ డ్రోన్ ట్రాఫిక్ సర్వేలెన్స్, డ్రోన్ ద్వారా ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా/సేవించడం/విక్రయించడం మొదలుగా అంశాలపై డ్రోన్ కెమెరాల ద్వారా సర్వేలను నిర్వహించి వాటిని నియంత్రించడంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అమ్మాయిలను ఈవ్ టీజ్ చేయడం, ఒంటరిగా వెళ్లే మహిళలు కావచ్చు లేదా వ్యక్తులునైనా బెదిరించడం, దొంగతనాలు వంటి నేరాలకు పాల్పడే వారికి డ్రోన్లతో చెక్‌ పెట్టవచ్చన్నారు. శివార్లలో ఓపెన్ డ్రింకింగ్ చేసి న్యూసెన్స్ క్రియేట్ చేయడం…వంటి చట్టవ్యతిరేక/అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచి వాటిని నియంత్రించడంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *