సంస్కృతి సంప్రదాయాలను నేటి తరాలకు గుర్తు చేస్తూ ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించటం అభినందనీయమని జిల్లా క్షయ, లెప్రసీ అధికారి సురేష్ బాబు అన్నారు. తాళ్లూరులో ఎబీసీ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన ముందస్తు సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఎబీసీ హైస్కూల్ వారు నిర్వహించిన సంబరాలు నేటి తరాలకు నాటి సంప్రదాయాలను గుర్తు చేసే విధంగా ఉన్నాయని అన్నారు. తన చిన్న తనంలో మరింత శోభగా సంక్రాంతి నిర్వహించుకునే వారని చెప్పారు. కర స్పాండెంట్ టి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ… సంక్రాంతి సంబరాలను ఎంతో కళాత్మకంగా, సాంప్రదాయ బద్దంగా నిర్వహించటం అభినందనీయని విద్యార్థులు చక్కగా నృత్యాన్ని ప్రదర్శించారని, ప్రొత్సహించిన ఉపాధ్యాయులకు అభినందనలు చెప్పారు. ఎబీసీ హైస్కూల్ ప్రిన్సిపాల్ కె వెంకటేశ్వర రావు మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలను విద్యార్థులకు గుర్తు చేస్తూ ప్రతి సంవత్సరం ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని అన్నారు. డైరెక్టర్ కాలేషా బాబు మాట్లాడుతూ… విద్యార్థులకు విద్యతో పాటు సంస్కృతి సంప్రదాయాలను గురించి తెలుపుతూ సంస్కృతికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. మండల వైద్యాధికారి షేక్ బాదర్ మస్తాన్ బి, కో ఆప్షన్ మెంబర్ కరిముల్లా రిటైర్డ్ ఉద్యోగుల సంఘ నాయకులు ఐ వెంకట రెడ్డి ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ముందుగా నిర్వహించిన ముగ్గుల పోటీలలో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించారు.









