ఇప్పుడే వస్తానంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువకుడు తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బేగంపేట రసూల్ పురా కృష్ణ నగర్ కట్ట కు చెందిన బెహరా సాయికిరణ్ (29) ప్రైవేటు ఉద్యోగిగా పని చేస్తుంటాడు.ఈ నెల 9వ తేదీన ఉదయం గం 11.15 నిమిషాలకు ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు అన్నారు. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం అతను ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి బెహరా కృష్ణవేణి బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసే విచారణ చేస్తున్నట్లు ఎస్సై ఆర్. జయ చందర్ తెలియజేశారు. యువకుడు ఇంటి నుంచి వెళ్లిన సమయంలో బ్లూ కలర్ ప్యాంటు , తెల్ల చొక్కా ధరించి ఉన్నాడు అన్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలు మాట్లాడగలడన్నారు. యువకుని ఆచూకీ తెలిసినవారు బేగంపేట పోలీస్ స్టేషన్లో గాని డయల్ 100కు గానీ సమాచారం ఇవ్వాలని ఎస్సై జయ చందర్ తెలియజేశారు.
