శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరి పైన ఉండాలి ….బిజెపి రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షుడు చీర సత్యనారాయణ……………..

శ్రీ భూ నీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరి పైన ఉండాలని బిజెపి రాష్ట్ర ఓబిసి ఉపాధ్యక్షుడు చీర సత్యనారాయణ (శ్రీకాంత్) అన్నారు. శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆయన కళాసి కూడా శ్రీ లక్ష్మీనారాయణ ఆలయం ఎస్పి రోడ్డులోని శ్రీ వీర హనుమాన్ ఆలయంలో ఉన్న శ్రీ భూ నీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, పాన్ బజార్ లోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ రోడ్ లోని శ్రీ వీర హనుమాన్ ఆలయంలో శ్రీ భూ నీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకుని పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఏకాదశి ప్రతి ఒక్కరి జీవితాలలో కొత్త కంతులు నింపాలని కోరుకున్నారు.అనంతరం చీర ను ఆలయ అర్చకుల సి. బద్రీనాథ్ చార్యులు అక్షంతలతో ఆశీర్వదించారు. వివో శ్రీనివాస్ శర్మ శాలువాతో సత్కరించే తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట బిజెపి నాయకులు నరేంద్ర పాల్, గోపి, కిషన్ ఉపాధ్యాయ, శ్రీనివాస్ యాదవ్, శ్రీధర్ ,ఆదేశ్ తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *