తూర్పుగంగవరం సర్పంచి చాట్ల నాగమణి భర్త చాట్ల సుధాకర్(34) చీమకుర్తి- తూర్పుగంగవరం రోడ్ లో మోటార్ సైకిల్ ప్రమాదంలో మృతి చెందాడు. ఆయనకు ఇరువుకు సంతానం. సుధాకర్ మృత దేహాన్ని టిడిపి దర్శి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టి పాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లితత్ సాగర్ లు సందర్శించి నివాళులు అర్పించారు. మండలపార్టీ అధ్యక్షుడు బొమ్మి రెడ్డి ఓబులు రెడ్డి, గ్రామ పార్టీ నాయకులు చందన,ఇతర నాయకులు మృత దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. యువ నాయకుడి మృతితో గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.

