వైకుంఠ ఏకాదశి సందర్భంగా మండలంలో పలు దేవాలయాలలో భక్తులతో కళ కళ లాడాయి. తూర్పుగంగవరం రామాలయం, బొద్దికూరపాడు, మాధవ స్వామి దేవాలయాలలో పూజారులు నారాయణం సీతారామ, ధనుజయ దీక్షితులు, వాసు, రమణయ్యలు ప్రత్యేక పూజలు చేసారు. బొద్దికూర పాడులో8 వంశపారంపర్య దాతలు వారసులు కోటేశ్వర రావు, రాజశేఖర్, ప్రసాద్ దంపతులు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గ్రామోత్సవం నిర్వహించారు.


