ముగ్గులు ప్రాథమికంగా మహిళలలోని కళాత్మకతను బహిర్గత పరిచే తొలి సాధనాలని శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధారమణ గుప్తా జంధ్యం అన్నారు. శ్రీగిరి ప్రదక్షణ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని స్థానిక లక్కీ షాపింగ్ మాల్ వారి సహకారంతో సంప్రదాయ ముగ్గుల పోటీలను స్థానిక బాపూజీ గో సంఘం గోశాల నందు శనివారం సాయంత్రం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని తమలో నిగూఢమైనటువంటి కళాత్మకతను ముగ్గురూపంలో అందంగా చిత్రించారు. కమిటీ వారు నిర్ణయించిన అచ్చంగా మెలికల ముగ్గులు వేయాలన్న నియమ నిబంధనలు తుచ తప్పకుండా పాటించారు. లక్కీయస్ట్ విన్నర్స్ కు మూడు బహుమతులుగా పట్టు చీరలను, మరో ఏడు మందికి కన్సోలేషన్ ప్రైజ్ గా చీరలను అందించారు. శ్రీగిరి గిరి ప్రదక్షణ కమిటీ సభ్యుడు, సాయి సహస్ర ఫౌండేషన్ నిర్వాహకులు ధనిశెట్టి రామునాయుడు పోటీలో పాల్గొన్న అందరికీ ప్రోత్సాహక బహుమతులను అందించారు. ప్రథమ విజేతగా ఐ అనురాధ, ద్వితీయ విజేతగా రాధాదేవి జంద్యం, మూడో విజేతగా సంధ్య మరియు లక్ష్మీ కుమారి, వరలక్ష్మి, అనిత, ధనిశెట్టి శృతి, జోష్ణ టి, కుసుమాంబ, ప్రణీత లు కన్సోలేషన్ బహుమతులను పొందారు. న్యాయ నిర్ణేతలుగా సురేఖ, బి విజయ రావు వ్యవహరించారు.
గిరిప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్త అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లక్కీ షాపింగ్ మాల్ యజమానులు గ్రంధె స్వామి, గ్రంధే శ్రీనివాసరావు, శీరాం రత్తయ్య, ప్రతినిధులు గ్రంధే వేంకట సుబ్బారావు, ప్రదీప్ శిఖాకొల్లి, శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటి ఉపాధ్యక్షులు తూనుగుంట మల్లిఖార్జున, సహకార్యదర్శి నేరేళ్ల శ్రీనివాసరావు, సభ్యులు చలువాది బ్రహ్మయ్య, ధనిశెట్టి రామునాయుడు, దోగిపర్తి మల్లిఖార్జున, సామి రాఘవేంద్ర, బొమ్మిరెడ్డి రాఘవ రెడ్డి, గుర్రం కృష్ణ, భూమా శ్రీనివాసులు, శేషసాయి జంట్స్ క్లాత్ షోరూం కనమర్లపూడి జయప్రకాశ్, కృష్ణదీపిక తదితరులు కార్యనిర్వహణ చేశారు.





