రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం- ఎంపీపీ తాటికొండ

పాడి పరిశ్రమనుప్రోత్సహిస్తూ, రైతాంగ
సంక్షేమమేధ్యేయంగా కూటమి ప్రభుత్వంపని చేస్తున్నదని ఎంపీపీ తాటికొండ శ్రీని వాసరావు అన్నారు. మండలంలోని శివరాంపురం గ్రామంలో ఉపాధిహామీ పధకం కింద్ర నిర్మించిన గోకుల్ షెడ్ను ఎంపీపీ తాటికొండ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ తాటికొండ మాట్లాడుతూ….. రైతాంగం పాడి పరిశ్రమపై ఆధార పడి జీవనంసాగిస్తూ ఉన్నారని, రైతాంగ సంక్షేమం కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. సీఎం చంద్రబాబు రైతాంగానికి సహకారం అందించేందుకుకృషి చేస్తున్నదన్నారు. సీఎం చంద్రబాబు రైతాంగానికి సహకారం అందించేందుకు 90శాతం సబ్సీడీపై గోకులం షెడ్లను మంజూరు చేశారన్నారు. షెడ్డు నిర్మాణానికి రూ2,30,000లు మంజూరు చేసిందని, రైతు తన వాటాగా 30 వేలు చెల్లించటం జరిగిందన్నారు. రైతాంగ కుటుంబం ఇబ్బందులు పడకుండా జీవనం సాగించేం దుకు గోకులం షెడ్ ఎంతో ఉపయోగ పడుతున్నదన్నారు. గ్రామాల్లో మహిళలకు ఈపథకంద్వారా మేలు జరుగుతుందన్నారు. ఎంపీడీవో కె. సుందరరామయ్య మాట్లాడుతూ… మండలంలో 29 గోకులం షెడ్లు మంజూరుకాగా నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు.గోకులం షెడ్ మంజూరైన లబ్ధిదారులు త్వరిత గతిన షెడ్లునిర్మించుకోవాలని, లేకుంటేశాంక్షన్ రద్దు పరిచి కొత్తవారికి మంజూరు చేయటం జరుగుతుందన్నారు. రైతాంగం త్వరిత గతిన షెడ్లునిర్మించాలన్నారు. ఎంపీపీ తాటి కొండ శ్రీనివాసరావు గోకులం షెడ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు బి.ఓబుల్ రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ కార్యనిర్వహక కార్యద ర్శులు శాగం కొండారెడ్డి, మానం రమేష్ బాబు, ఒంగోలు పార్లమెంట్ ప్రధాన కా ర్యదర్శి మేడగం వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర తెలుగుయువత కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు, ఏపీవో మురళి, పశువైద్యాదికారి ప్రతాప్ రెడ్డి, టీడీపీ నాయకులు గొంది రమణారెడ్డి(సమర),రాచకొండవెంకట్రావు,ఐ.శ్రీనివాసరెడ్డి, జి.లక్ష్మినారాయణ,పిన్నిక రమేష్,రామకోటిరెడ్డి,సూరిబాబు,జనసేననేత హనుమంతరావు, సుబ్బారావు, ఫీల్డ్ అసిస్టెంట్ బూచిరాజు, ఇంచార్జి ఈసీ గురుబాబు, టీఏలు, ఎస్ఏలు, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *