దేశ ఆధ్యాత్మిక దీప్తిని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహోన్నతులు స్వామి వివేకానంద – వాసవిక్లబ్ ఒంగోలు సిటిజెన్స్ అధ్యక్షులు భూమా శ్రీనివాసులు- ఘనంగా స్వామి వివేకానంద జయంతి.

స్వామి వివేకానంద అమెరికాలో జరిగిన సర్వమత సమ్మేళనంలో భారత దేశ ప్రతినిధిగా పాల్గొని తమ చిరునవ్వుతో సభ సదులను సోదర సోదరీ మణులారా అంటూ సంభోదించి మంత్రముగ్ధులనుగావించి భారతదేశ ఆధ్యాత్మిక దీప్తిని, భారతీయ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహోన్నతుడని వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్ అధ్యక్షులు భూమా శ్రీనివాసులు పేర్కొన్నారు. తమ ఉపన్యాసాల ద్వారా దేశ యువతను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే విధంగా ప్రేరేపించారని, స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవం గా జనవరి 12న దేశవ్యాప్తంగా యువజనుల కోసం ప్రత్యేక సమావేశాలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నదని తెలిపారు. వారి స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని ఈ సందర్భంగా భూమా శ్రీనివాసులు పిలుపునిచ్చారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ కార్యవర్గ సభ్యులు స్థానిక శర్మ కాలేజ్ ప్రాంగణంలోని వివేకానంద ప్రతిమకు పూలమాలకృతం చేసి జేజేలు పలికారు.

కార్యక్రమంలో వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ కార్యదర్శి మద్దాలి శివప్రసాద్, కోశాధికారి సంపత్, జోన్ చైర్మన్ పబ్బిశెట్టి గోవర్ధన్, జిల్లా అధికారి నల్లమల్లి బద్రీనారాయణ, క్లబ్ పూర్వ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *