కొత్త ఎల్లయ్య హై స్కూల్ లో ఆకట్టుకుంటున్న బొమ్మల కొలువు

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సికింద్రాబాద్ సోమ సుందరం వీధిలోని కొత్త ఎల్లయ్య హై స్కూల్ లో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు విశేషంగా ఆకట్టుకుంటోంది. భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా తీర్చిదిద్దిన బొమ్మలు కొలువుదీరి, అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఉత్తమ పురుషునికి పర్యాయ పదంగా నిలిచే శ్రీరామ చంద్రుని చంద్రుని జననము, పట్టాభిషేకం, దశావతారాలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసుల ప్రాధాన్యతను కళ్ళకు కట్టినట్టు ఆవిష్కరించారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ బొమ్మల కొలువును వీక్షించేందుకు విద్యార్థినీ, విద్యార్థులు, తల్లిదండ్రులతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. కాగా పిల్లలకు చదువుతో పాటు మన ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సాంప్రదాయాలను పట్ల ఆసక్తిని కలిగించదానికి తాము ఎప్పటికప్పుడు వైవిధ్య భరిత కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని పాఠశాల కరస్పాండెంట్ కొత్త శంతన్ కుమార్, ప్రిన్సిపాల్ కొత్త ఝాన్సీరాణి లు తెలిపారు. అధ్యాపకుల, తల్లిదండ్రుల సహకారంతో తాము మున్ముందు ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహిస్తామని వారు వెల్లడించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *