బన్సీలాల్ పేట డివిజన్ లోని న్యూ బోయగూడ లోని రైల్ కళారంగ్ వద్ద ఆదివారం గ్యార్వీ ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై గౌస్ ఏ పాక్ చిల్లా వద్ద నిర్వహించిన ప్రార్ధనలలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్మ హేమలత, లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు ఏసూరి మహేష్, లక్ష్మీపతి, రమణ, శ్రీకాంత్ రెడ్డి, ఫహీం, కుమార్ యాదవ్, అబ్బాస్, కుషాల్, నిర్వాహకులు ఎం డి అస్లాం, ముర్తుజా, అక్బర్, జావేద్, ఆయూబ్, గౌసియా బేగం, సాజిదా తదితరులు పాల్గొన్నారు.


