రేపు రియాద్ పర్యటకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి…….

సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో జరగనున్న ‘ఫ్యూచర్ మినరల్స్ ఫోరమ్ మినిస్టీరియల్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్’లో పాల్గొనేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రియాద్ వెళ్తున్నారు. సౌదీ అరేబియా ప్రభుత్వ ఆహ్వానం మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సోమవారం (13 జనవరి)
రాత్రి రియాద్ బయలుదేరతారు.
మంగళవారం (14 జనవరి) నుంచి మూడ్రోజులపాటు రియాద్ లో ‘టువర్డ్స్ గ్రాండ్ అగ్రిమెంట్’ థీమ్ తో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఖనిజ వనరుల అభివృద్ధి అంశంపై ఈ సందర్భంగా విస్తృతమైన చర్చ ఉంటుంది.
అనంతరం వివిధ దేశాల బొగ్గు,గనుల శాఖ మంత్రులతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు.
ఈ కాన్ఫరెన్స్ లో కేంద్రమంత్రులు, కంపెనీల సీఈవోలు ఈ కాన్ఫరెన్స్ లో ప్రసంగించనున్నారు. రియాద్ లో సౌదీ అరేబియా ప్రభుత్వం ఖనిజ సంపదపై ఫలప్రదమైన చర్చ జరగడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖనిజ సంపద సద్వినియోగం అవ్వాలన్న లక్ష్యంతో సౌదీ అరేబియా వేదికగా మూడేళ్లుగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *