లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు ఎలైట్ సిటిజన్స్ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి సందర్భంగా ఈరోజు పట్టణములోని శర్మ కాలేజీలో గల వివేకానంద విగ్రహంనకు పూలమాలలు వేయడం జరిగింది. వివేకానంద యువతకు మార్గదర్శకుడు అని కొనియాడటం జరిగినది. ఈ కార్యక్రమంలో క్లబ్ ఫౌండర్ కూరపాటి రమేష్ గారు అధ్యక్షులు ఈదరవెంకటేష్ గారు, కార్యదర్శి గ్రంథే పార్థసారధి గారు, కోశాధికారి లక్ష్మణ స్వామి గారు మరియు క్లబ్ పూర్వ అధ్యక్షులు పల్లపు సుబ్బయ్య గారు, తమ్మన ఆంజనేయులు గారు, అబ్బిశెట్టి జనార్ధన గారు తమ్మన ఆంజనేయులు గారు పోకూరి నవీన్ గారు మరియు క్లబ్ సభ్యులందరూ పాల్గొనడం జరిగింది.
