రజానగరం గ్రామంలో కుక్కల దాడిలో ఓ జింక తీవ్రంగా గాయపడినది. గ్రామస్తులు, సచివాలయ సిబ్బంది కుక్కలను తరిమి జింకను తాళ్లూరు పశువైద్యశాలకు తీసుకువచ్చారు. పశువైద్యాధికారి ప్రతాప్ రెడ్డి వైద్యం అందించారు. సచివాలయ సిబ్బంది అటవీ శాఖ సిబ్బంది సమాచారం అందించారు. వారు జింకను తీసుకుని వెళ్లారు.


