దేశ స్వాతంత్ర్యం ఎంతో మంది మహనీయులు ప్రాణ త్యాగం చేశారు………సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్…

దేశ స్వాతంత్ర్యం కోసం అనేకమంది మహనీయులు ప్రాణాలను త్యాగం చేశారని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 76 వ రిపబ్లిక్ డే సందర్బంగా సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలలో ఆయన జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జాతీయ గీతాలాపన చేసి స్వీట్లు పంపిణీ చేశారు.  గాంధీ హాస్పిటల్ వద్ద నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకలలో వివిధ దేశ భక్తుల వేషధారణలతో పాల్గొన్న చిన్నారులు అలరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

*సనత్ నగర్* లో……….

సనత్ నగర్ లోని బస్టాండ్ వద్ద నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముందుగా జాతీయ నాయకుల చిత్రపటాలకు నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేసిన అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొలన్ లక్ష్మి, బి ఆర్ ఎస్  పార్టీ డివిజన్ అద్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, నాయకులు ఖలీల్, శేఖర్, సురేష్ గౌడ్, సామ్యూల్, బాలరాజ్, వసీం, జమీర్, సమి ఉల్లా తదితరులు పాల్గొన్నారు.

*అమీర్ పేట* లో….

అమీర్ పేట డివిజన్ లోని సత్యం థియేటర్ సర్కిల్ లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకలలో మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి సంతోష్ మణి కుమార్, నాయకులు ప్రవీణ్ రెడ్డి, కూతురు నర్సింహ, గోపిలాల్ చౌహాన్, గుడిగే శ్రీనివాస్ యాదవ్, ఉత్తమ్ కుమార్ రాజ్ పురోహిత్, గులాబ్ సింగ్, జితేందర్ శుక్లా, బలరాం, సంపత్, బాసా లక్ష్మి, రాణి కౌర్ తదితరులు పాల్గొన్నారు.

*బేగంపేట డివిజన్* లో….

డివిజన్ లోని రసూల్ పురా సర్కిల్ లో నిర్వహించిన 76 వ రిపబ్లిక్ డే వేడుకలకు ఎమ్మెల్యే  తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ టి.మహేశ్వరి, డివిజన్ బి ఆర్ ఎస్  పార్టీ అద్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు టి.శ్రీహరి, నరేందర్, శేఖర్, ఆరీఫ్, అఖిల్, రఘునందన్ రావు, నసీమ్ బాను, తదితరులు పాల్గొన్నారు.

*రాంగోపాల్ పేట డివిజన్* లో….

డివిజన్ లోని ఓల్డ్ బోయగూడ, నాగెల్లి దుర్గయ్య స్కూల్, జనరల్ బజార్ లో బెంగాలీ అసోసియేషన్ ఆధ్వర్యంలో, స్వప్న లోక్ కాంప్లెక్స్ తదితర ప్రాంతాలలో ఎమ్మెల్యే  తలసాని శ్రీనివాస్ యాదవ్ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్, డివిజన్ బి ఆర్ ఎస్  అద్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కిషోర్ కుమార్, ఆంజనేయులు, రాంమోహన్ యాదవ్, ఆనంద్ పాటిల్, పబ్బా ప్రకాష్, అబ్బుల్, అరుణ్ భట్, సతీష్ తదితరులు ఉన్నారు.

*మోండా డివిజన్ లో*….

మోండా డివిజన్ లోని పాలికా బజార్ చౌరస్తాలో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకలకు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే  తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, డివిజన్ బి ఆర్ ఎస్  అద్యక్షుడు ఆకుల హరికృష్ణ, నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, నాగులు, మహేష్ యాదవ్, అమర్ తదితరులు పాల్గొన్నారు.

*బన్సీలాల్ పేట డివిజన్ లో*…

డివిజన్ లోని జబ్బార్ కాంప్లెక్స్ వద్ద నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకలలో ఎమ్మెల్యే  తలసాని శ్రీనివాస్ యాదవ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్మ హేమలత, బి ఆర్ ఎస్  పార్టీ నాయకులు లక్ష్మీపతి, ప్రేమ్ కుమార్, అరుణ్, కుమార్ యాదవ్, ఫహీం, లడ్డు, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.

*గాంధీ హాస్పిటల్*….

గాంధీ హాస్పిటల్ ముందు గల మహాత్మాగాంధీ విగ్రహం వద్ద 76 వ రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిధిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశ భక్తుల వేష ధారణలతో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు. ఈ కార్యక్ర్మమలో లష్కర్ జిల్లా సాధన సమితి అద్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్ ఏసూరి సావిత్రి, డివిజన్ బి ఆర్ ఎస్  పార్టీ అద్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు ఏసూరి మహేష్, సాధం బాల రాజ్ యాదవ్,  శైలేందర్, శ్రీకాంత్ రెడ్డి, రమణ, అంబు లెన్స్ సురేష్, గజ్జెల శ్రీనివాస్, దేశాపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *