తాళ్లూరు మండలంలోని పలు ప్రభుత్వ, ప్రభుత్వ పాఠశాలలో
కార్యాలయాలలో 76వ గణతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీఓ దార హనుమంతరావు, తహసీల్దార్ కార్యాలయాల ఆవరణలలో తహసీల్దార్ తహసీల్దార్ రాజు, పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐఐ మల్లిఖార్జున రావు, ఎంఆర్సీ వద్ద ఎంఈఓ జి. సుబ్బయ్య, పీహెచ్సీలో వైద్యాధికారి షేక్ ఖాదర్ మస్తాన్‌బీ, వికే జూనియర్ కళాశాల కొండ పల్లి ఆంజనేయులు, హెచ్ఎం శేష గిరి వార్డెన్ తేరెజమ్మ జెండాను ఎగుర వేసారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీలు ఐ. వెంకటేశ్వరరెడ్డి, సర్పంచిల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్రసేనా రెడ్డి, టిడిపి పార్టీ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి ఓబులు రెడ్డి సర్పంచి పీఎస్. శ్రీకాంత్ రెడ్డి, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా, ఎంపీటీసీ ప్రభుదాస్, అన్ని శాఖల అధికారులు మండలంలోని అన్ని పంచాయితీలలో సచివాలయాలలో ఆయా గ్రామాల సర్పంచిల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ నిర్వహించారు. ప్రాముఖ్యతను వివరించారు. తాళ్లూరులో శ్రీ సరస్వతి హైస్కూల్లో విద్యాసంస్థల చైర్మన్ ఎవీ రమణా రెడ్డి, ఎబీసీ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయుడు కె. వెంకటేశ్వరరావు, గీతాంజలి, జాహ్నవి. గంగ, ప్రగతి, శారద, అమెరికన్ పాఠశాలలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జెండాను ఎగుర వేసి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. మిఠాయిలు పంపిణీ చేసారు.
