తేజ వయో వృద్ధాశ్రమంలో ఎపీ గ్రంధాలయ చైర్మన్, టిడిపి పార్టీ కార్యదర్శి గోనుగుంట్ల కోటేశ్వర రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. యర్రగొర్ల అంజిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో బీసీ సెల్ టిడిపి మండల అధ్యక్షుడు పిన్నిక రమేష్ పాల్గొని వృద్ధులకు కూటమి ప్రభుత్వంలో పెన్షన్ లు పెంచి ఎంతో మేలు చెసారని, గోనుగుంట్ల కోటేశ్వర రావు విభిన్న ప్రతిభావంతుల మాజీ చైర్మన్ గా అందించిన సేవలను కొనియాడారు. కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేసారు. వీరాంజి, నాగ రాజు, అంకయ్యలు పాల్గొన్నారు.
