కళారూపాలు కళలను నేర్చుకోవటం ద్వారా క్రమశిక్షణ అలవుడుతుందని అన్నారు. సంస్కార భారతి ఆధ్వర్యంలో విద్యార్థులకు కలసి పాడుదాం దేశభక్తి గీతాల బహుమతి ప్రదానోత్సవ సభలో ఆమె ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. స్వాతంత్ర పోరాటంలో దేశభక్తి గీతాల ప్రాధాన్యత మరువలేనిదన్నారు. ఆంధ్రకేసరి విద్యా కేంద్రంలో జరిగిన కలసి పాడుదాం దేశభక్తి గీతాల పోటీల్లో బృంద గీతాలాపన పోటీల్లో సుమారు 40 బృందాలు పాల్గొన్నాయి. వీరిలో నారాయణ ఈటెక్నో, జుపిటర్, ఢిల్లీ, నిర్మల హైస్కూల్ విద్యార్థులు ఉత్తమ బృందాలుగా ఎంపిక చేసి ఇన్‌కంటాక్స్ ఆఫీసర్ స్వర్ణలత బహుమతులు అందజేశారు. సభకు అధ్యక్షత వహించిన ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వేంకట శ్రీనివాసులు మాట్లాడుతూ సాహిత్యం ఆలోచింపజేస్తే సంగీతం ఆనందింపజేస్తుందన్నారు. సంగీత సాహిత్యాలు స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరిపోసాయని పేర్కొన్నారు. ఎకెవికె కాలేజీ ఛైర్మన్ మండువ నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులను సన్మార్గంలో తీర్చిదిద్దేందుకు ఎకెవికె విద్యా సంస్థలు నిరంతరం కృషిచేస్తున్నాయని తెలిపారు. సంస్కార భారతి జిల్లా కన్వీనర్ పత్తి రంగమన్నార్ మాట్లాడుతూ కళల ద్వారా సంస్కారవంతమైన సమాజాన్ని రూపొందించేందుకు ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవానికి, స్వాతంత్ర్య దినోత్సవానికి, హిందు దేవతల విశిష్టమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశభక్తి, దైవభక్తిని పెంపొదిస్తున్నట్లు చెప్పారు.
కార్యక్రమంలో కోటిస్ షాపింగ్ మాల్ అధినేత కోటి సూర్యనారాయణ పాల్గొన్నారు. న్యాయనిర్ణేతలుగా ఐ.మురళీకృష్ణ, పద్మా సురేష్, శారద, హరిప్రియ వ్యవహరించారు.



